Fri Dec 20 2024 11:03:47 GMT+0000 (Coordinated Universal Time)
ముందుగానే జాగ్రత్త పడ్డ శిల్పా చౌదరి
ప్రముఖులను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని పోలీసులు నేడు ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
ప్రముఖులను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని పోలీసులు నేడు ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఒకరోజు కస్టడీ ముగియడంతో ఆమెను తిరిగి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. నిన్న శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ సమక్షంలో బ్యాంకు లాకర్లను తెరిచారు. బ్యాంకు లాకర్లలో కొన్ని డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్లలో మాత్రం నగదు లేదు. శిల్పా చౌదరి తెలివిగా తన బ్యాంక్ అకౌంట్లలో నగదు లేకుండా జాగ్రత్త పడ్దారు.
కీలక ఆధారాలేవీ....?
దీంతో కీలక ఆధారాలేమీ పోలీసులకు లభించలేదని తెలిసింది. హయత్ నగర్ లో 240 గజాల స్థలం ఒకటి ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే సిగ్నేచర్ విల్లా ఒకటుంది. ఈ రెండింటిని విక్రయించి తాను అప్పుతీసుకున్న వారికి చెల్లిస్తానని శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. మల్టీ ఆసుపత్రి నిర్మాణంలో కూడా తాను పెట్టుబడులు పెట్టానని ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వారు ఆ దిశగా విచారణ చేయాల్సి ఉంది.
Next Story