Fri Dec 20 2024 01:59:16 GMT+0000 (Coordinated Universal Time)
నా తండ్రిది హత్యే... సింగర్ హరిణి ఫిర్యాదు
సింగర్ హరిణి కుటుంబం వారం రోజుల నుంచి అదృశ్యమయింది. ఆమె తండ్రి ఏకే రావు బెంగళూరులో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.
సింగర్ హరిణి కుటుంబం వారం రోజుల నుంచి అదృశ్యమయింది. అయితే ఆమె తండ్రి ఏకే రావు బెంగళూరులో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తన తండ్రి ది హత్యేనని హరిణి అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు బెంగళూరు పోలీసులకు హరిణి ఫిర్యాదు చేసింది. శ్రీనగర్ కాలనీలో ఏకే రావు కుటుంబం నివాసముంటుంది.
సుజనా ఫౌండేషన్ లో...
ఏకే రావు రిటైర్ అయిన తర్వాత సుజనా ఫౌండేషన్ లో సీఈవోగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఏకేరావును హత్య చేసేంత కారణాలు ఎవరికి ఉంటాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హరిణి కుటుంబ సభ్యుల ఫోన్లు వారం రోజుల నుంచి స్విచ్ ఆఫ్ కూడా అయ్యాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story