Thu Dec 19 2024 03:53:38 GMT+0000 (Coordinated Universal Time)
వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం స్పీడ్ పెంచింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "సిట్" నిందితులను విచారంచేందుకు సిద్ధమయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ను ఇప్పటికే విచారించింది. ఆయన నుంచి కొంత సమాచారం సేకరించింది.
రామచంద్ర భారతి టార్గెట్ గానే...
సింహయాజీకి ఎందుకు విమాన టిక్కెట్లు బుక్ చేశారన్న దానిపై ఆరా తీసింది. తాజాగా ఈ కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు కూడా నోటీసులు జారీ చేసింది. వీరు బయట దేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ శ్రీనివాస్ ను మరోసారి సిట్ విచారించనుంది. రెండేళ్ల రామచందర్ భారతి ఎక్కడెక్కడకు వెళ్లారు? ఆయన ఫోన్ లో ఎవరెవరిని సంప్రదించారు? అన్న రీతిలోనే సిట్ విచారణ కొనసాగనుంది.
Next Story