Mon Dec 23 2024 05:38:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆరు మృతదేహాలు.. ఒకే ఇంట్లో.. ఎందుకంటే?
ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు లభించాయి. ఇది జమ్మూ ప్రాంతంలో కలకలం రేపింది
ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు లభించాయి. ఇది జమ్మూ ప్రాంతంలో కలకలం రేపింది. జమ్మూలోని సిద్ధ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుకావడంతో ఆత్మహత్య చేసుకున్నారా? లేదా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అందరూ కుటుంబ సభ్యులే...
సిధ్రా ప్రాంతంలోని ఒక ఇంట్లో సకీనా బేగం, రుబీనా బనో, నసీమా అక్తర్, జాఫర్ సలీం, నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్ లు విగత జీవులుగా పడి ఉన్నారు. వీరిలో ఉల్ హజీబ్, సాజిద్ అహ్మద్ లు నసీమా అక్తర్ బంధువులు కాగా, మిగిలిన వారు కుటుంబ సభ్యులు. అయితే ఈ మరణాలకు కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జమ్మూలోని ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story