Mon Dec 23 2024 02:28:36 GMT+0000 (Coordinated Universal Time)
ఏం కష్టం?.. ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో జరిగింది
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో జరిగింది. హర్యానాలోని అంబాలా సమీపంలో ఒక గ్రామాంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అంబాలా సమీపంలోని బలన గ్రామంలో సుఖ్విందర్ సింగ్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. సుఖ్విందర్ సింగ్ తో పాటు భార్య రీనా, కుమార్తెలు ఆషు, జెస్ీ, సుఖ్వీందర్ తండ్రి సంగత్ రామ్, తల్లి మహీంద్ర కౌర్ లు ఆత్మహత్య చేసుకుని మరణించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆర్థిక వత్తిడి తట్టుకోలేక...
ఆర్థిక వత్తిడి తట్టుకోలేక ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతదేహాల వద్ద లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుఖ్విందర్ సింగ్ ఒక ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు తమకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తాన్ని ఇచ్చుకోలేని సుఖ్విందర్ సింగ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలసింది. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుఖ్వీందర్ పనిచేస్తున్న కంపెనీ అధికారులను పిలిచి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Next Story