Mon Dec 23 2024 09:49:10 GMT+0000 (Coordinated Universal Time)
పండుగ రోజు తీవ్ర విషాదం.. సముద్రంలో ఆరుగురు గల్లంతు
యువకులంతా టీనేజర్లేనని తెలుస్తోంది. సింగ్ నగర్ కి చెందిన అభి ఉదయం 4 గంటలకే స్నేహితులతో కలిసి బాపట్లకు
మహర్నవమి పండుగ రోజున తీవ్ర విషాద ఘటన జరిగింది. బెజవాడ సింగ్ నగర్ నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్ కి వెళ్లిన 8 మంది యువకుల్లో 6 గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నారు. యువకులంతా టీనేజర్లేనని తెలుస్తోంది. సింగ్ నగర్ కి చెందిన అభి ఉదయం 4 గంటలకే స్నేహితులతో కలిసి బాపట్లకు వెళ్లాడని తల్లి తెలిపింది.
మృతులు విజయవాడలోని సింగ్నగర్కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా గుర్తించారు. ఫణి, రాఘవ, ప్రభు దాసు ఆచుకీ ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వీరంతా ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదువుతున్న పిల్లలని పోలీసులు తెలిపారు. దసరా సెలవులు కావడంతో ఉదయం వీరంతా ట్రెైన్లో బాపట్లకు చేరారు. అక్కడ నుంచి ఆటోలో సూర్యలంకకు వెళ్లామని.. క్షేమంగా బయటకు వచ్చిన బాలుడు తెలిపాడు. పండుగ పూట యువకుల మృతి ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
Next Story