Mon Dec 23 2024 02:50:12 GMT+0000 (Coordinated Universal Time)
48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు, భద్రతా దళాలు మట్టుబెట్టాయని స్థానిక అధికారులు వెల్లడించారు. హతమైన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇటీవల
కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు కలిసి 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు.అనంత్ నాగ్ లోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నాడని విశ్వసనీయ సమాచారం రావడంతో.. శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ ను ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో ఉగ్రవాదిని లొంగిపోవాలని కోరినా వినకుండా.. పోలీసులు, భద్రతా దళాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో.. ఎదురుకాల్పులు జరిపి ఆ ఉగ్రవాదిని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు, భద్రతా దళాలు మట్టుబెట్టాయని స్థానిక అధికారులు వెల్లడించారు. హతమైన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇటీవల బిజ్జెహరా పీఎస్ సమీపంలో ఏఎస్సై మహ్మద్ అష్రఫ్ ను హత్య చేసిన ఉగ్రవాది కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొన్నిగంటల ముందు పాత శ్రీనగర్ నగరంలోని మిర్జన్పోరా పరిసరాల్లో ఇంట్లో ఉన్న రౌఫ్ అహ్మద్ అనే పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.
Next Story