Mon Dec 23 2024 06:48:37 GMT+0000 (Coordinated Universal Time)
కంటైనర్ ను ఢీ కొట్టిన కారు.. కారుని ఢీ కొట్టిన ట్రక్కు: నలుగురి మృతి
ముంబై–పూణె ఎక్స్ ప్రెస్ వేపై ఘాట్ లోనొ ఖోపోలి ఎగ్జిట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో వరుసగా ఆరు వాహనాలు
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి ఘటన మహారాష్ట్రలోని ఖండావాలా ఘాట్ రోడ్ లో చోటుచేసుకుంది. ఓ కారు దానికి ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీ కొట్టగా.. వెనుకే వచ్చిన ట్రక్కు కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు కంటైనర్ - ట్రక్కు మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. దాంతో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు ఘటనా ప్రాంతంలోనే మరణించారు. ముంబై–పూణె ఎక్స్ ప్రెస్ వేపై ఘాట్ లోనొ ఖోపోలి ఎగ్జిట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో వరుసగా ఆరు వాహనాలు ఒకదాని వెనక మరొకటి ఢీకొట్టుకున్నాయి.
Also Read : వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన ట్రాన్స్ జెండర్ జంట
ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఖోపోలి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. విషమంగా ఉన్న ముగ్గురిని ఎంజీఎం కామోతి ఆస్పత్రికి తరలించారు. రెండు ట్రక్కుల మధ్య నుజ్జునుజ్జయిన కారును క్రేన్ సహాయంతో బయటికి తీసి, అందులోని మృతదేహాలను సిబ్బంది బయటికి తీశారు. మృతులు గౌరవ్ ఖారత్ (36), సౌరభ్ తులసి (32), సిద్ధార్థ్ రాజగురు (31)గా గుర్తించారు. మరో మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగంతో వెళ్తున్న ట్రక్కు టైరు పంక్చర్ అవ్వడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.
Next Story