Mon Dec 23 2024 04:51:09 GMT+0000 (Coordinated Universal Time)
దేవుడి ప్రచారం రథంలో గంజాయి రవాణా.. పోలీసులు పసిగట్టడంతో?
గంజాయి రవాణాలో కొత్త మార్గాలను స్మగ్లర్లను ఎంచుకుంటున్నారు. దేవుడి ప్రచార రథంలోనూ గంజాయిని తరలిస్తున్నారు
గంజాయి రవాణాలో కొత్త మార్గాలను స్మగ్లర్లను ఎంచుకుంటున్నారు. పోలీసులు కళ్లుగప్పి గంజాయి తరలించడానికి కొత్త కొత్త రూట్లను అవలంబిస్తున్నారు. అయితే ఎంత దాచుకుని గంజాయి తరలిస్తున్నా పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేక పోతున్నారు. వేల కిలోల కొద్దీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నా ప్రతి రోజూ స్మగర్లు వాటి తరలింపునకు ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా భధ్రాచలంలో దేవుడి ప్రచార రథంలో గంజాయిని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు.
భద్రాచలం ప్రచార రథంలో...
గంజాయి తరలింపునకు చివరకు దేవుడి ప్రచార రధాన్ని కూడా ఉపయోగించుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. అయితే పోలీసులకు ఆ వాహనంలో గంజాయి తరలిస్తున్నారని ముందుగా సమాచారం అందడంతో పట్టుకున్నారు. పైకి దేవుడి ప్రచార రథంలా కనిపిస్తున్నా లోపల ప్రత్యేకంగా క్యాబిన్ ను తయారు చేసి అందులో 484 కిలోల గంజాయిని దాచి పెట్టారు. హర్యానాకు చెందిన మున్సీరాం, బగత, గోవింద్ లను అరెస్ట్ చేశారు. గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story