Mon Dec 23 2024 01:12:05 GMT+0000 (Coordinated Universal Time)
డ్రాగన్ కంట్రీకి పాము విషాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.. దాని విలువ ఎంతో తెలుసా ?
అతని నుండి ఏకంగా రెండున్నర కేజీల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషం విలువ దాదాపు రూ.30 కోట్లు..
ఫ్రాన్స్ దేశం నుంచి వయా భారత్ మీదుగా చైనాకు అక్రమంగా పాము విషాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నుండి ఏకంగా రెండున్నర కేజీల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషం విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపిన అటవీ శాఖ అధికారులు శనివారం రాత్రి రెండున్నరకేజీల విషాన్ని గుర్తించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని ఖురాయి ప్రాంతంలో నివసిస్తున్న మహమ్మద్ సరాఫత్ గా గుర్తించారు.
పోలీసుల విచారణలో నిందితుడు.. పాము విషం ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వచ్చినట్లు తెలిపాడు. ఈ విషాన్ని నేపాల్ మీదుగా చైనాకు తరలించేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొన్నాడు. కాగా.. పాయిజన్ బాటిల్ కు ఫ్రాన్స్ కు చెందిన ట్యాగ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ రవాణా తరలింపులపై నిఘా పెట్టామని అంతర్జాతీయ స్మగ్లింగ్ యూనిట్ పాత్రపై విచారణ జరుపుతున్నామని రేంజర్ సోనమ్ భూటియా వెల్లడించారు.
Next Story