Sat Mar 29 2025 13:45:21 GMT+0000 (Coordinated Universal Time)
వివాహితకు సాఫ్ట్ వేర్ వేధింపులు.. బ్లేడుతో దాడి
విశాఖ జిల్లా సింహాచలంలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన చంద్రశేఖర్..

మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. పెళ్లికాని అమ్మాయిల్నే కాదు.. పెళ్లైన ఆడవారిని కూడా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు కొందరు సైకోలు. కొన్ని సంఘటనలలో ప్రియుడి మోజులో పడి భర్తలను కడతేర్చిన ఆడవారుండగా.. మరికొన్ని ఘటనల్లో తనను కాదని వేరేవారిని పెళ్లాడినందుకు ప్రియురాలిని చంపిన వారున్నారు. కానీ.. ఇది అంతకుమించింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
విశాఖ జిల్లా సింహాచలంలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన చంద్రశేఖర్.. ఓ వివాహితను వేధిస్తున్నాడు. "నిన్ను ప్రేమిస్తున్నాను. నీ భర్తను వదిలి నాతో వచ్చేయ్. నాకు గ్యాంగ్ ఉంది, నీ భర్తను చంపించేస్తా." అంటూ వివాహితను వేధించాడు. అతను మాటలను కాదనడంతో.. ఆమెపై కోపం పెంచుకుని అవకాశం చూసి బ్లేడుతో దాడిచేశాడు. బాధితురాలికి తీవ్రగాయమవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలకు 6 కుట్లు వేసి వైద్యులు చికిత్స చేశారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story