Mon Dec 23 2024 05:51:03 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరులో.. ఏపీ టెకీ దారుణం
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పరిసరాల్లోని అపార్ట్మెంట్లో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణానికి ఒడిగట్టాడు. అతని భార్య
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పరిసరాల్లోని అపార్ట్మెంట్లో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణానికి ఒడిగట్టాడు. అతని భార్య, వారి ఇద్దరు కుమార్తెలు విగతజీవుల్లా కనిపించారు. కుండలహళ్లిలోని ఓ ప్రైవేట్ సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న వీరర్జున్ విజయ్ తన భార్య హేమావతి (29) ని చంపడమే కాకుండా.. కుమార్తెలైన రెండున్నరేళ్ల మోక్ష మేఘనయన, ఎనిమిది నెలల చిన్నారి సృష్టి సునయన లను గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విజయ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఈ జంటకు పెళ్లయి ఆరేళ్లు అయింది. అపార్ట్మెంట్లో సూసైడ్ నోట్ లభించలేదు. దంపతుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో అనుమానం వచ్చింది.
సోమవారం (జూలై 31) అర్ధరాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు, హేమావతి తమ్ముడు శేష సాయి అపార్ట్మెంట్ కు వచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు వారి ప్రకారం గత రెండు రోజులుగా ఫ్లాట్ దగ్గర కుటుంబ సభ్యులు కనిపించలేదని తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి అయిన సాయి బుధవారం తన సోదరికి చాలాసార్లు కాల్ చేసినప్పటికీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఏదో జరిగిందని భావించి.. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకున్నాడు. లోపల నుండి తాళం వేసి ఉందని గమనించాడు. మెయిన్ డోర్‌ను చాలాసార్లు తట్టిన తర్వాత కూడా ఎటువంటి స్పందన లేదు. కిటికీలోంచి చూడగా లోపల మృతదేహాలు కనిపించాయి. సాయి, ఇరుగుపొరుగువారి సహాయంతో తలుపులు పగులగొట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో ఈ దారుణం బయటకు వచ్చింది.
ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ లైట్లు స్విచ్ ఆన్ చేసే ఉంచారు. జూలై 31 రాత్రి నుండి ఎవరూ ఇంటి నుండి బయటకు రాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాం" అని తెలిపారు.
Next Story