Mon Dec 23 2024 03:19:09 GMT+0000 (Coordinated Universal Time)
సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య.. ప్రేమ వివాహమే కారణమా..?
ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని జిన్నారంలో నారాయణ రెడ్డి మృతదేహం కనిపించింది.
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. సగం కాలిన మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేగింది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన 25 సంవత్సరాల నారాయణ రెడ్డి 20 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని జిన్నారంలో నారాయణ రెడ్డి మృతదేహం కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు నారాయణ రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. సగం కాలిన డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.
నారాయణ రెడ్డి ఏడాది క్రితమే ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యువతి పేరెంట్స్‌కు ఈ వారి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆమెను ఇంటికి తీసుకువెళ్లి నారాయణ రెడ్డిని బెదిరించినట్టు తెలుస్తోంది. యువతిని హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ కేసును పరువు హత్యగా భావించి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల కిందట నారాయణరెడ్డిని యువతి బంధువు శ్రీనివాస్‌రెడ్డి బెదిరించాడని.. నారాయణరెడ్డి బంధువులు ఫిర్యాదు చేశారు. యువతి బంధువులు హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ కేసును విచారిస్తూ ఉన్నారు పోలీసులు.
Next Story