Mon Dec 23 2024 09:23:26 GMT+0000 (Coordinated Universal Time)
వేధింపులు భరించలేక.. టెక్కీ ఆత్మహత్య
తన భర్త హేమంత్ వేధింపులకు గురిచేస్తున్నా.. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని, వాళ్లు కూడా తమ ఇష్టానికి మాట్లాడారని..
భర్త వేధింపులు భరించలేక హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన చావుకి కారణం భర్తేనని పేర్కొంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఫేస్ బుక్ లో లైవ్ వీడియో పెట్టి తన గోడు తెలిపింది. ఐదు నెలలుగా తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సన పేర్కొంది. ఆ వీడియోలోనే సన ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు.
తన భర్త హేమంత్ వేధింపులకు గురిచేస్తున్నా.. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని, వాళ్లు కూడా తమ ఇష్టానికి మాట్లాడారని తెలిపింది. రాజస్థాన్ లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా వేధింపులు పెరిగాయని, బిడ్డ ఉన్నా పట్టించుకోకుండా.. తనను వేధించేవాడని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. చిత్రహింసలు పెట్టేవాడని తెలిపింది. ఇటీవలే హైదరాబాద్ లోని నాచారం కు వచ్చిన సన.. ఇక్కడే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెకీగా పనిచేస్తోంది. భర్త వేధింపులు మరింత ఎక్కువ అవడంతో.. భరించలేక ప్రాణం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story