Mon Dec 23 2024 10:15:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకాశం జిల్లాలో వివాహిత దారుణ హత్య
కోట రాధ (35) అనే మహిళ కనిపించకుండా పోయిందని అప్పటికే కంప్లైంట్ నమోదవ్వగా.. ఆమెను అత్యంత కిరాతకంగా..
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెలపాడు శివారులో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఓ వివాహితను నిందితులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కోట రాధ (35) అనే మహిళ కనిపించకుండా పోయిందని అప్పటికే కంప్లైంట్ నమోదవ్వగా.. ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహం జిల్లెళ్లపాడు సమీపంలో రోడ్డు పక్కన లభ్యమైంది. నిందితులు తొలుత రాధ కాళ్లపై నుంచి కారును పోనిచ్చారు. ఆ తర్వాత ఆమె గుండెలపై నుంచి కారును నడిపారు. ఎక్కడ బతుకుతుందోనన్న అనుమానంతో ముఖంపై బండరాయితో మోది క్రూరంగా హత్య చేసినట్టు తెలుస్తోంది.
రాధ కనిపించడం లేదంటూ ఆమె తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. వెలిగండ్ల మండలం గుండ్లోపల్లికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు రూ. 50 లక్షలు అప్పు ఇచ్చారని, వాళ్లే ఈ హత్య చేసి ఉంటారని రాధ తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుధాకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రాధ భర్త మోహన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Next Story