Mon Dec 23 2024 14:39:50 GMT+0000 (Coordinated Universal Time)
పశ్చిమగోదావరిలో పచ్చి మోసం
పశ్చిమగోదావరి జిల్లాలో మహిళను కొందరు మోసం చేశారు. సైబర్ మోసం చేయడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
పశ్చిమగోదావరి జిల్లాలో మహిళను కొందరు మోసం చేశారు. సైబర్ మోసం చేయడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో ఈ ఘటన జరిగింది. లాటరీలో కారు గెలిచారంటూ మహిళ ఖాతా నుంచి పథ్నాలుగు లక్షలు మాయం చేశారు.
14 లక్షల మాయం...
లాటరీలో కారు గెల్చుకున్నారని మోసం చేసిన దుండగులు మాయమాటలు చెప్పి నమ్మించారు. చీరలు కొంటే కారు గెలిచారంటూ సెల్ఫోన్ కు సమాచారం అందించారు. కారు ఇవ్వాలంటే ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు చెప్పాలంటూ కోరగా ఆ మహిళ వెంటనే ఇచ్చింది. మహిళ ఖాతాలో ఉన్న పథ్నాలుగు లక్షల డబ్బును మాయం చేశారు. ఇది గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story