Mon Dec 23 2024 14:20:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో తండ్రిపై కొడుకు, కొడుకుపై తండ్రి దాడులు
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం మావిళ్ళపాడు గ్రామంలో మద్యానికి బానిసైన తండ్రి సుబ్రమణ్యం..
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ క్రైం రేటు పెరుగుతోంది. ఇటీవల పరువు హత్యలు, ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల ఏపీలో ఓ తండ్రి మద్యానికి డబ్బు ఇవ్వడం లేదని కొడుకు తల నరికి దానితో గ్రామ వీధుల్లో తిరిగిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఏపీ, తెలంగాణల్లో మరో రెండు ఘటనలు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం మావిళ్ళపాడు గ్రామంలో మద్యానికి బానిసైన తండ్రి సుబ్రమణ్యం.. మద్యం మత్తులో 10 ఏళ్ల కొడుకుపై కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన బంధువులపై కూడా సుబ్రమణ్యం దాడి చేయగా వారంతా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టీక్యా తండాకు చెందిన బానోతు రాములు తొర్రూరుకు వచ్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి రాములుపై కొడుకు స్వామి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. రాములును 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని స్వామిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story