Mon Dec 23 2024 18:12:54 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు
వీరిద్దరూ బైక్ పై వెళ్తున్న సమయంలో కులకచర్ల మండలం బండ్లవెల్లికిచర్ల ప్రభుత్వ పాఠశాల ముందు ఒక టాటా ఏసీ వాహనం..
వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలంలోని బండ వెల్లికచర్ల ప్రభుత్వ పాఠశాల ముందు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొడుకు మృతి చెందగా, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులకు ప్రమాదం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. టాటా ఏసీ వాహనం రాంగ్ రూట్లో వచ్చి బైక్ ను ఢీ కొట్టడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన తండ్రి అశోక్ (45), కొడుకు చరణ్ (18) ఇద్దరు ముంబైలో డైలీ లేబర్లుగా పని చేస్తూ ఉండేవారు.
వీరిద్దరూ బైక్ పై వెళ్తున్న సమయంలో కులకచర్ల మండలం బండ్లవెల్లికిచర్ల ప్రభుత్వ పాఠశాల ముందు ఒక టాటా ఏసీ వాహనం రాంగ్ రూట్లో అత్యంత వేగంగా వచ్చి బైక్ ఢీ కొట్టింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తలకు తీవ్ర గాయమైన కొడుకు చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలైన అశోక్ ను ప్రథమ చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం నగర హాస్పిటల్ కు తరలించారు. బండవెల్లి కచెర్ల లోని ఆశ్రమ పాఠశాలలో ఉన్న బంధువుల పిల్లలను చూసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story