Mon Dec 23 2024 02:04:20 GMT+0000 (Coordinated Universal Time)
కసాయి కొడుకు.. భార్యకోసం తల్లిని తీసుకెళ్లి
కసాయి కొడుకు.. భార్యకోసం తల్లిని తీసుకెళ్లి.. అత్తా కోడళ్ల మధ్య గొడవ.. చివరికి
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. పెళ్లి అయ్యాక అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరగడంతో చివరికి తల్లి అని కూడా చూడకుండా హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా దాచాలని అనుకున్నాడు కానీ.. నిజం దాచలేకపోయాడు.
బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన కె సుబ్బులమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. ఆమె కుమారుడు శ్రీనివాసరావు, కోడలితో కలిసి జీవనం సాగిస్తోంది. అత్త, కోడళ్ల మధ్య అసలు పడేది కాదు. కొడుక్కి పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా వీరిద్దరి మధ్య వివాదాలకు ముగింపు పడలేదు. ఇటీవల శ్రీనివాసరావు అదే గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. రెండురోజుల క్రితం ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన శ్రీనివాసరావు భార్య.. అత్తగారు ఆ ఇంట్లో ఉంటే నేను ఉండనంటూ చెప్పేసింది. దీంతో అతడు తల్లి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అందరూ నిద్రపోయాక తల్లిని బైక్ పై కూర్చోపెట్టుకుని ఊరి చివర ఉన్న చిన్నమ్మకుంట వద్దకు తీసుకెళ్లి, అందులో ఆమెను తోసేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం కుంటలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలాని కి వచ్చిన పోలీసులు మృతదేహన్ని పరిశీలించి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. విచారణలో కుటుంబంలో ఉన్న గొడవలన్నీ బయటకు వచ్చాయి. శ్రీనివాస రావును గట్టిగా నిలాదీయడంతో అసలు విషయం చెప్పాడు. తానే తన తల్లిని చంపేశానని భోరున ఏడ్చేశాడు.
Next Story