Mon Dec 23 2024 14:59:35 GMT+0000 (Coordinated Universal Time)
తల్లి, అక్కను దారుణంగా హత్య చేసిన 19 ఏళ్ల యువకుడు
SECL ఉద్యోగి R K దాస్ ఇంటి ప్రధాన ద్వారం గత కొన్ని గంటలుగా తెరిచి ఉండటాన్ని సమీపంలోని ఇరుగుపొరుగు వారు గమనించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఓ వ్యక్తి తన తల్లి, అక్కను హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అతని వయస్సు 19 సంవత్సరాలు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
కుస్ముండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఇసిఎల్లోని ఆదర్శ్ నగర్ కాలనీలో అమన్ దాస్.. తన తల్లి లక్ష్మి (44), ఆమె సోదరి ఆంచల్ (21)లను కత్తితో పొడిచి హతమార్చాడు. వారి ఇంటి బాత్రూమ్లో కత్తితో పొడిచి చంపినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లితేష్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ ఇంటి పెద్ద ఆర్కే దాస్ ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
SECL ఉద్యోగి R K దాస్ ఇంటి ప్రధాన ద్వారం గత కొన్ని గంటలుగా తెరిచి ఉండటాన్ని సమీపంలోని ఇరుగుపొరుగు వారు గమనించారు. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి చూడగా, బాత్రూమ్లో మహిళ, ఆమె కూతురు రక్తంతో తడిసిన స్థితిలో పడి ఉన్నారు. స్థానికులు ఇంటి యజమాని ఆర్కే దాస్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సోదాలు చేశారు. విచారణ అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు దారి పట్టణ పోలీసు సూపరింటెండెంట్ లితేష్ సింగ్ తెలిపారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story