Sun Dec 22 2024 22:43:50 GMT+0000 (Coordinated Universal Time)
Murder : అనంతపురంలో దారుణం.. వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని హత్య
వైసీపీకి తన కన్న తల్లి ఓటు వేసిందని ఆమెను హత్య చేసిన కిరాతకుడైన కుమారుడి ఉదంతం తెలియ వచ్చింది
ఏపీలో జరిగిన ఎన్నికలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. అనేక చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి తలపడుతున్నాయి. అయితే అనంతపురం జిల్లాలో ఒక ఘటన మరింత బాధాకరం. వైసీపీకి తన కన్న తల్లి ఓటు వేసిందని ఆమెను హత్య చేసిన కిరాతకుడైన కుమారుడి ఉదంతం తెలియ వచ్చింది. మద్యం మత్తులో కన్నతల్లిని హత్యచేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
ఇనుప రాడ్ తో వచ్చి...
అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు టీడీపీలో ఉండేవాడు. తన తల్లి సుంకమ్మ వైసీపీికి ఓటు వేసినట్లు చెపపడంతో ఆగ్రహించి మద్యంతాగి వచ్చి ఇనుపరాడ్ తో తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడికే మరణించింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరకున్నారు. వెంకటేశ్వర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story