Mon Dec 23 2024 18:59:31 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్తికోసం తండ్రిని నరికి చంపిన కొడుకులు
ఎరగాని శ్రీను గౌడ్ (50)కి సంతు, రాజశేఖర్ ఇద్దరు కొడుకులు, భార్య, కూతురు ఉన్నారు. శ్రీను కి కొంత వ్యవసాయభూమి ఉంది.
సూర్యాపేట : మానవత్వం మంటగలిసిపోతుంది. రోజురోజుకూ మానవ బంధాలు, అనుబంధాలు విలువ లేకుండా పోతోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు.. వారిపాలిట యమపాశాలుగా మారుతున్నారు. ఆస్తులు పంచివ్వకపోతే.. తల్లిదండ్రులను సైతం మట్టుబెట్టేందుకు వెనకాడటం లేదు. అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది.
తమకు భూమిని పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కన్నతండ్రిని దారుణంగా నరికి చంపారు. ఎరగాని శ్రీను గౌడ్ (50)కి సంతు, రాజశేఖర్ ఇద్దరు కొడుకులు, భార్య, కూతురు ఉన్నారు. శ్రీను కి కొంత వ్యవసాయభూమి ఉంది. ఆ భూమిని ఇద్దరికీ పంచివ్వాలని తరచూ తండ్రితో గొడవలు పడేవారు. ఎన్నిసార్లు అడిగినా భూమిని పంచివ్వకపోవడంతో.. తమలోని రాక్షసత్వాన్ని చూపించారు. కని, పెంచి, పెద్దచేసిన తండ్రిని గురువారం ఉదయం గొడ్డలి, కత్తితో దారుణంగా నరికి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. గ్రామానికి చేరుకొని,సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
Next Story