Mon Dec 23 2024 15:10:44 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ అనుచరుడికి "సిట్" నోటీసులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చింది. సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ కు అనుచరుడిగా శ్రీనివాస్ ఉన్నారు.
ఫ్లైట్ టిక్కెట్లు కొనుగోలు చేశారని...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం అయింది. ఇందులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చింది. రామచంద్రభారతికి ఫ్లైట్ టిక్కెట్లను కొనుగోలు చేశారని శ్రీనివాస్ పై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానాన్ని తొలగించుకునేందుకు తమ ఎదుట హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది.
Next Story