Mon Dec 23 2024 16:56:30 GMT+0000 (Coordinated Universal Time)
అదుపుతప్పిన కారు.. హుస్సేన్ సాగర్ లోకి?
అతి వేగంగా వచ్చిన ఈ కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకుపోవడం పోలీసులను సయితం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎన్టీఆర్ పార్కు ముందు ఒక కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ట్యాంక్ బండ్ లోకి దూసుకెళ్లింది. దీంతో ఆ కారు హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. అతి వేగంగా వచ్చిన ఈ కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకుపోవడం పోలీసులను సయితం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కారులో ముగ్గురు యువకులున్నారు. వీరంతా ఖైరతాబాద్ కు చెందిన వారు.
అతి వేగమే....
ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్ లు నాలుగు రోజల క్రితమే కొన్న కొత్త కారులో అప్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి బయలుదేరారు. అయితే హుస్సేన్ సాగర్ మీదకు రాగానే కారు అదుపుతప్పింది. వేగంగా వచ్చి హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- car
- hussain sagar
Next Story