Mon Dec 23 2024 04:44:19 GMT+0000 (Coordinated Universal Time)
160 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన మృత్యువు
గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొనడంతో
గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొనడంతో పోలీసు కానిస్టేబుల్‌తో సహా తొమ్మిది మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో జాగ్వార్ కారు 160/కిమీ వేగంతో దూసుకువచ్చింది. అంతకు ముందు ఆ ప్రాంతంలో థార్, డంపర్ వాహనానికి ప్రమాదం జరిగింది. దీని కోసం ప్రజలు సైట్లో గుమిగూడారు. ఇంతలో జాగ్వార్ కారు దూసుకువచ్చేసింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, జాగ్వార్ కారు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.
బుధవారం-గురువారం మధ్య రాత్రి సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్‌పై మహీంద్రా థార్ వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా, అతివేగంతో దూసుకొచ్చిన లగ్జరీ కారు జనాల మీదకు దూసుకు వచ్చేసింది. రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు ఇస్కాన్ వంతెన మొత్తాన్ని మూసివేశారు.
Next Story