Thu Dec 26 2024 05:51:01 GMT+0000 (Coordinated Universal Time)
గన్ తో తనను కాల్చుకున్న కానిస్టేబుల్
విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణానికి పాల్పడ్డారు.
విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఉదయం ఐదు గంటలకు బలవన్మరణం పొందారు. విధులకు హాజరైన శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ తో కాల్చుకొని బవవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆయన ఈ బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారన్నది తెలియ రాలేదు.
గన్మెన్ గా పనిచేస్తూ...
ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు శంకర్రావు నిర్వహిస్తున్నారు. శంకర్రావు కి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ద్వారక పోలీస్ స్టేసన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కుటుంబ విభేదాల కారణంగా శంకర్రావు బలవన్మరణానికి పాల్పడ్డారా? లేద మరేదైనా కారణమా? అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story