Sat Dec 21 2024 02:22:10 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ పై వెళుతుంటే లిఫ్ట్ ఇచ్చాడు.. అలా చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు
ముదిగొండ మండలంలో రైతుకు తన మోటర్‌బైక్‌పై అపరిచిత వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడం సరిదిద్దుకోలేని తప్పిదంగా
బైక్ మీద వెళుతూ ఉన్నప్పుడు కొందరు లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. పాపం బస్ మిస్ అవ్వడమో, లేక ఆ ఊరికి పెద్దగా వెహికల్ కనెక్టివిటీ లేదనో మనం భావించి లిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ఈ లిఫ్ట్ తీసుకున్న వ్యక్తులలో కొందరు కేటుగాళ్లు ఉంటారనే విషయం మరచిపోకూడదు. ఏకంగా మన ప్రాణాలు తీసేసే ప్లాన్ లను కూడా రచించేసి ఉంటారు. దొరికినంత దోచుకుని వెళ్లాలని అనుకునే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
జిల్లాలోని ముదిగొండ మండలంలో రైతుకు తన మోటర్‌బైక్‌పై అపరిచిత వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడం సరిదిద్దుకోలేని తప్పిదంగా మారింది. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన రైతు షేక్ జమాల్ సాహెబ్ (55) తన కుమార్తెను కలిసేందుకు తన మోటర్‌బైక్‌పై ఆంధ్రప్రదేశ్‌లోని గండ్రాయి గ్రామం వైపు వెళ్తున్నాడు. ముదిగొండ మండలం వల్లాభి గ్రామం సమీపంలో మంకీ క్యాప్ ధరించి బైక్‌పై లిఫ్ట్ కావాలని కోరగా, జమాల్ సాహెబ్ అతడిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. అయితే వెనుక ఉన్న వ్యక్తి జమాల్ సాహెబ్ తొడలపై ఒక విషపు ఇంజక్షన్ వేసి, వాహనం నుండి దూకి పారిపోయాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన బైక్ రైడర్ బైక్‌ను ఆపి బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. విషం శరీరంలోకి చేరడంతో స్పృహతప్పి పడిపోయాడు. రోడ్డు పక్కన పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వల్లభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ముదిగొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో హంతకుడు విషం ఎక్కించడానికి ఉపయోగించిన సిరంజి లభ్యమైంది.
Next Story