Thu Dec 19 2024 10:54:04 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మాయితో లవ్.. ఎగ్జామ్ హాల్ లో విద్యార్థిపై దాడి
తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ..
![student attacked by another student student attacked by another student](https://www.telugupost.com/h-upload/2023/04/20/1493144-student-attacked-by-another-student.webp)
ఈ కాలంలో ప్రేమకు సరైన అర్థం లేకుండా పోయింది. టీనేజ్ రాకముందే పిల్లలు లవ్ అంటూ తిరుగుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో అనవసరమైన వ్యాపకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ఎఫెక్టో గానీ.. మేం ప్రేమలో ఉన్నాం అని చెప్పుకోవడం పెద్ద గొప్ప అనుకుంటున్నారు. ప్రేమించడం తప్పు కాదు.. కానీ దానికంటూ ఒక వయసు ఉంటుంది. పోనీ ఒకరినే ప్రేమిస్తున్నారా ? అంటే కాదు. ఏకంగా ఇద్దరు ముగ్గురిని లైన్లో పెట్టేస్తున్నారు. ఫలితంగా ఏదొక రూపేణా ప్రమాదంలో చిక్కుకుంటున్నారు.
తాజాగా.. ఎగ్జామ్ హాల్ లో పరీక్ష రాస్తోన్న విద్యార్థిపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ అమ్మాయితో విద్యార్థి ప్రేమ వ్యవహారమే ఈ ఘర్షణకు కారణం కావడం గమనార్హం. ఇద్దరు విద్యార్థుల మధ్య మాటమాట పెరగడంతో.. రాజానగరంకు చెందిన లోడగాల ఉదయ్ శంకర్ అనే విద్యార్థి అదే తరగతిలో చదువుతోన్న తూర్పు గానుగూడెంకు చెందిన పింక్ హరిసాయి అనే మరొక విద్యార్థిపై దాడి చేసి, కత్తితో పొడిచాడు. ఉపాధ్యాయులంతా చూస్తుండగానే ఎగ్జామ్ హాల్ లో ఈ ఘటన జరిగింది.
దాంతో హరిసాయి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు టీచర్లు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరిసాయికి వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. ఒక అమ్మాయి కోసం విద్యార్థులు ఇలా కొట్టుకోవడం చర్చకు దారితీసింది.
Next Story