Sat Dec 21 2024 04:47:37 GMT+0000 (Coordinated Universal Time)
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
నిజాంసాగర్ మండలంలోని మాగ్దుంపూర్ కి చెందిన శిరీష తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
మద్నూర్ : కామారెడ్డి జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మద్నూర్ మండలం ఎక్లార గేట్ సమీపంలో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలో శిరీష(17) ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఉన్నట్లుండి ఆ విద్యార్థిని పాఠశాల గ్రౌండ్ లో ఉన్న నీటి ట్యాంకులో శవమై కనిపించింది. శిరీష ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా నీటి ట్యాంకులోకి పడేసి హత్య చేశారా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Also Read : బీహార్ పేలుడు ఘటన : పెరుగుతున్న మృతుల సంఖ్య
నిజాంసాగర్ మండలంలోని మాగ్దుంపూర్ కి చెందిన శిరీష తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ పనిచేసుకుంటూ.. ఇక్కడ కూతుర్ని గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న శిరీష.. తనకు ఇంట్లో, స్కూల్లో కూడా విలువ లేదని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా.. విద్యార్థిని మృతిపట్ల విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story