Wed Jan 15 2025 13:00:58 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలో భారీ చీటింగ్.. ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు !
నగరంలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి విదేశాలకు పంపిస్తున్నారు.
విజయవాడలో ఓ కన్సల్టెన్సీ చేస్తున్న భారీ మోసాన్ని అమెరికన్ ఎంబసీ బట్టబయలు చేసింది. ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తామంటూ కన్సల్టెన్సీ చీటింగ్ లకు పాల్పడుతోంది. నగరంలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి విదేశాలకు పంపిస్తున్నారు. ఈ స్కామ్ లో ముళ్లపూడి కేశవ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
మంగళవారం ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్.. విజయవాడ వచ్చి స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. అదే సమయంలో మీడియా అక్కడికి చేరుకోగా.. వారందరినీ బయటికి పంపేసి సిబ్బంది పరారయ్యారు. కంపెనీ ఎండీ కేశవ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పారిపోయారు.
Next Story