Mon Dec 23 2024 08:30:05 GMT+0000 (Coordinated Universal Time)
భర్త మోసం చేయడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్తే.. అక్కడ కూడా?
భర్త మోసం చేయడంతో.. అతనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళపై అత్యాచారం చేశాడు సబ్ ఇన్ స్పెక్టర్.
భర్త మోసం చేయడంతో.. అతనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళపై అత్యాచారం చేశాడు సబ్ ఇన్ స్పెక్టర్. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు. ఫలితంగా అతనితో పాటు 8 మందిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పీఎస్ పరిధిలో గల ఓ ప్రాంతానికి చెందిన మహిళ (32)కు పెళ్లై తొమ్మిదేళ్ల కూతురు ఉంది. మనస్పర్థల కారణంగా మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అతను కూడా మోసం చేయడంతో ఫిర్యాదు చేసేందుకు పళుగల్ పీఎస్ కు వెళ్లింది.
సాయం చేస్తున్నట్లు...
ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆ మహిళపై అప్పటి సబ్ ఇన్ స్పెక్టర్ సుందరలింగం (40) కన్నేశాడు. ఆమెకు సహాయం చేస్తున్నట్లుగా నమ్మించి పలుచోట్లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. మహిళ గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న సుందరలింగం తన స్నేహితులతో కలిసి ఆమెను ఆటోలో పులియరంగిలోని క్లినిక్ లో డాక్టర్ కార్మల్ రాణి (38) వద్దకు తీసుకెళ్లారు. ఏమీ లేదు.. వైద్య పరీక్షల కోసమే తీసుకొచ్చానని నమ్మబలికి అబార్షన్ చేయించాడు.
అబార్షన్ చేయించి...
దీనిపై బాధితురాలు పలుమార్లు కకళియకోవిల్, మార్తాండం పోలీస్ స్టేషన్లలో డీఎస్పీ, ఎస్పీ ఆఫీసుల్లో కూడా ఫిర్యాదు చేసింది. అయినా ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో కుళిత్తురై కోర్టును ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. సుందరలింగం, గణేష్ కుమార్ (35), మార్తాండానికి చెందిన అభిషేక్ (45), తిరువట్టార్ కు చెందిన కార్మల్ రాణి, దేవదరాజ్ (57) ఇలా 8 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశంతో మార్తాండం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story