Sun Dec 22 2024 23:40:27 GMT+0000 (Coordinated Universal Time)
ఎనిమిది మందిని కాల్చి చంపాడు.. చివరికి
అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు
అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. జోలియట్లోని వెస్ట్ ఎకర్స్ రోడ్లో ఉన్న 2200 బ్లాక్లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ మీడియాకు వెల్లడించారు.
23 ఏళ్ల రోమియో నాన్స్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నాన్స్ కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారయ్యాడు. అతడి వద్ద ఆయుధం ఉండడంతో స్థానిక పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసింది. టెక్సాస్లోని నటాలియా సమీపంలో నాన్స్ ను గుర్తించారు. పోలీసులు చుట్టుముడుతూ ఉన్నారని భావించే సమయంలో అతను తనను తాను కాల్చుకుని చనిపోయాడు. చికాగో శివార్లలోని మూడు ప్రదేశాలలో నాన్స్ ఎనిమిది మంది వ్యక్తులను ఘోరంగా కాల్చిచంపాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని, అయితే బాధితులు నాన్స్కు తెలుసునని పోలీసులు తెలిపారు.
Next Story