Tue Dec 24 2024 02:46:27 GMT+0000 (Coordinated Universal Time)
యాక్సిడెంట్ కాదా? కుట్ర కోణం ఉందా?
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక పోలీసులు మృతి చెందారు
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక పోలీసులు మృతి చెందారు. అయితే ఇది ప్రమాదమా? లేక ఎవరైనా యాక్సిడెంట్ చేశారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎస్ఐ అవినాష్, కానిస్టేబుల్ అవినాష్, ప్రయివేటు డ్రైవర్ అనిల్ మరణించారు. ఒక డివైడర్ ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. ప్రమాదంలో ఎస్ఐ దీక్షిత్ పోలీస్ కానిస్టేబుల్ శరవణ, బసవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
తెల్లవారు జామున....
అయితే డివైడర్ ను ఢీకొని కారు ఈ ప్రమాదానికి గురైందని తొలుత భావించారు. కానీ కొందరు కావాలనే కారును ఢీకొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ స్మగ్లర్లు కారును వెంబడించి వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురిచేసినట్లు ప్రాధమికంగా అధికారులు భావిస్తున్నారు. వారి కోసం వెదుకులాడుతున్న పోలీసులను వెంటాడి యాక్సిడెంట్ చేసి చంపి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బి. కొత్తకోట బ్రిడ్జి వద్ద తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కర్ణాటక పోలీసుల ఉన్నతాధికారుల సూచనతో ఏపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story