Wed Dec 25 2024 01:51:39 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. స్వాతిని అతి కిరాతకంగా
కాలయముడయ్యాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రియుడే కాలయముడయ్యాడు. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ ముక్కలై గోనె సంచిలో తేలింది. ఈ హత్యోదంతం మొత్తం డబ్బు చుట్టూ సాగింది.
జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రం. స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరభద్రం భార్యతో స్వాతికి గొడవ జరిగింది.చుంచుపల్లి పీఎస్లో స్వాతిపై కేసు నమోదైంది. స్వాతి కోసం పోలీసులు వెతకగా ఆమె కనిపించడం లేదనే విషయం తెలిసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు అతని నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో తమదైన శైలిలో విచారించారు.
స్వాతిని చంపేసినట్లు వీరభద్రం ఒప్పుకోవడమే కాకుండా.. చంపి పాతిపెట్టిన గోనె సంచిని తీసి పోలీసులకు చూపించాడు. జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని స్వాతి మోసం చేసి వాళ్ల దగ్గరి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసింది. ఆ జంట పోలీసులను ఆశ్రయించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఆ డబ్బు మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో స్వాతిని హతమార్చాడు వీరభద్రం. పథకం ప్రకారమే స్వాతిని గత మూడు రోజుల క్రితం బయటకు తీసుకువెళ్లి అతి దారుణంగా హత్య చేసి పొలంలో పాతిపెట్టినట్లు పోలీసుల ముందు వీరభద్రం ఒప్పుకున్నాడు.
Next Story