Mon Dec 23 2024 11:09:01 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. ఒకరు మృతి
స్థానికుల ద్వారా ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి..
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో సోమవారం ఉదయం ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో.. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు బైక్ ల పైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. వాహనదారుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నసీర్ గా గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలవ్వగా.. వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
స్థానికుల ద్వారా ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో టిప్పర్ లారీ అదుపుతప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story