Wed Apr 09 2025 22:25:47 GMT+0000 (Coordinated Universal Time)
కోయంబత్తూరులో హై అలర్ట్
తమిళనాడు కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

తమిళనాడు కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆలయాలు, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ ల వద్ద భద్రతను మరింత పెంచారు. కోయంబత్తూరులో ఆదివారం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
గాలింపు చర్యలు...
దాదాపు మూడు వేల మంది భద్రతదళాలను మొహరించారు. జిల్లా అంతటా జల్లెడ పడుతున్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేస్తున్నారు. కారుపేలుడులో చనిపోయిన ముబిన్ కు ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానం ఉండటంతో అన్ని చర్యలు తీసుకున్నారు. ముబిన్ నివాసం నుంచి భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Next Story