Mon Dec 23 2024 11:36:08 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నైలో 20 ఏళ్ల నర్సుపై దారుణం
చెన్నైలోని చెంగల్‌పేట సమీపంలో 20 ఏళ్ల నర్సుపై కారులో సామూహిక అత్యాచారం చేశారు.
చెన్నైలోని చెంగల్‌పేట సమీపంలో 20 ఏళ్ల నర్సుపై కారులో సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం చెంగల్‌పేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాధిత యువతి ఒక సంవత్సరం క్రితం ఒక ప్రైవేట్ సంస్థలో డిప్లొమా పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరు నెలల శిక్షణ పొందింది. యువతి వేలూరులో నర్సు పోస్టు కోసం ఇంటర్వ్యూకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె బస్టాప్‌లో ఉండగా శరవణన్ అనే స్నేహితుడు డిన్నర్ చేద్దామని ఆహ్వానించి తన కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో శరవణన్ తన స్నేహితులు సారధి, సూర్యప్రకాష్‌లను పికప్ చేసుకున్నాడు. ఆపై యువతిని వారు నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై విడిచివెళ్లారు. బాధితురాలు మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు అడ్డుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News Summary - Three Men Gang Rape Nurse In A Car Dump Her On Road
Next Story