Mon Dec 23 2024 14:41:29 GMT+0000 (Coordinated Universal Time)
వరుస దాడుల్లో 31 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
సోమవారం తెల్లవారుజామున ఆర్ఎస్ఐలు విశ్వనాథ్, వినోద్ కుమార్ టీమ్ లు రేణిగుంట మండలం తిమ్మినాయుడు పాలెం పరిధిలోని
మూడ్రోజులుగా టాస్క్ ఫోర్స్ జరిపిన వరుస దాడుల్లో 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడించారు. మూడు టాస్క్ ఫోర్స్ టీమ్ లు మూడ్రోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై వరుస దాడులు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
Also Read : మాస్ లుక్లో బాలయ్య.. వేట మొదలైందయ్యా!
సోమవారం తెల్లవారుజామున ఆర్ఎస్ఐలు విశ్వనాథ్, వినోద్ కుమార్ టీమ్ లు రేణిగుంట మండలం తిమ్మినాయుడు పాలెం పరిధిలోని అడవిలో కూంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ తారస పడ్డారని తెలిపారు. వారిని చుట్టుముట్టగా దుంగలను పడేసి పరుగు లంకించడంతో.. వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారన్నారు. మిగతావారు పరారైనట్లు తెలిపారు.
పట్టుబడిన ఇద్దరు.. తమిళనాడు వేలూరు జిల్లా, పెంజమానదైకు చెందిన పి.రాజేంద్రన్ (41), కె.కుమార్ (35)లుగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 20న ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ శ్రీవారి మెట్టు సమీపంలో 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుందని తెలిపారు. రాజంపేట డివిజన్ ఓబులవారి పల్లి ముసలి కుంట వద్ద ఆర్ ఐ కృపానంద పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ 31 ఎర్రచందనం దుంగలు 836 కిలోలు ఉండగా, వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు.
Next Story