Mon Dec 23 2024 14:57:26 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ మొదలైన క్యాబరే డ్యాన్సులు.. టకీలా పబ్ సీజ్
నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి దాటినా పబ్ ను కొనసాగించింది. పబ్ నిర్వహణపై సమాచారం అందుకున్న హైదరాబాద్..
హైదరాబాద్ : క్యాబరే డ్యాన్సులు.. చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ వంటి నగరాల్లో కనిపించాయి. ఆ తర్వాత క్యాబరే డ్యాన్సులను నిషేధించడంతో.. మాయమయ్యాయి. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ పబ్బుల్లో క్యాబరే డ్యాన్సులు కనిపించాయి. శనివారం రాత్రి సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టకీలా పబ్ లో క్యాబరే డ్యాన్సులు కనిపించాయి. పబ్ లో మద్యం మత్తులో తూగుతున్న మందుబాబులను హుషారు పరిచేందుకు పబ్ యాజమాన్యం యువతులతో క్యాబరే డ్యాన్సులు ఏర్పాటు చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి దాటినా పబ్ ను కొనసాగించింది. పబ్ నిర్వహణపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టకీలా పబ్ పై శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నారని నిర్థారించుకుని సీజ్ చేశారు. క్యాబరే డ్యాన్స్ నిర్వాహకులైన 18 మందిని అరెస్ట్ చేశారు.
Next Story