Mon Dec 23 2024 07:42:55 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో టిడిపి మాజీ ఎంపి కొడుకు అరెస్ట్
ఆయనకు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరు : టిడిపి మాజీ ఎంపి ఆదికేశవులు నాయుడు కుమారుడు చిత్తూరు జిల్లా టిడిపి నేత డీకే శ్రీనివాస్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. గురువారం ఎన్సీబీ అధికారులు శ్రీనివాస్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ కు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాకు చెందిన డీకే శ్రీనివాస్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారం చేసి.. వృద్ధి సాధించారు. అయితే ఆయనకు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ, కర్ణాటకల్లోని సినీ, రాజకీయ ప్రముఖులకు డీకే శ్రీనివాసులు నాయుడు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని ఎన్సీబీకి సమాచారం అందింది. దాంతో ఆయన ఇంటితో పాటు.. సన్నిహితుల ఇళ్లల్లోనూ ఎన్సీబీ సోదాలు చేయగా.. భారీగా డ్రగ్స్ లభ్యమైనట్లు సమాచారం. బిజినెస్ మ్యాన్ గా పేరొందిన శ్రీనివాస్ ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈ కేసులో శ్రీనివాస్ తో పాటు.. కన్నడ నటుడిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story