Mon Dec 23 2024 03:49:08 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జీతాలు సకాలంలో రావడం లేదని ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మల్లేష్ అనే ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు
అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మల్లేష్ అనే ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపాధ్యాయుడు తన ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వ వైఖరే కారణమంటూ పేర్కొనడం విశేషం. ఉరవకొండ మండలం చిన్న ముస్తూరుకు చెందిన మల్లేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆరోగ్యం విషమం...
తమ జీతాలను ఒకటో తేదీనే చెల్లించాలని, సీపీఎఎస్ ను రద్దు చేయాలని ఆయన తాను రాసిన లేఖలో కోరారు. ప్రతి నెల ఐదో తేదీకల్లా జీతం ఇవ్వడమే తన కోరిక అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. పెన్నా అహోబిలం ఆలయ పరిసరాల్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Next Story