Mon Dec 23 2024 10:28:31 GMT+0000 (Coordinated Universal Time)
నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కనివ్వను : నెల్లూరు ఘటనలో జరిగింది ఇది !
ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. కోవిడ్ కారణంగా ఇద్దరూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటూ విధులు ..
నెల్లూరు : ప్రేమించడం లేదని ఒకడు, పెళ్లికి ఒప్పుకోవడం లేదని మరొకరు ఇలా ఎంతో మంది యువతుల ప్రాణాలను బలిగొంటున్నారు. అమ్మాయి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మాకు నచ్చితే చాలు అనే రీతిలో కొందరు వ్యవహరిస్తున్నారే చెప్పాలి. కావ్య (26), సురేశ్ రెడ్డి(35) ఇద్దరికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం, నెలకు లక్షల్లో వేతనాలు, వరుసకు బావ మరదలు, వీరి ఇళ్లు కూడా పక్కపక్క వీధుల్లోనే. ఇంకేముంది ఎంచక్కా మనం పెళ్లి చేసుకుందాం అంటూ.. సురేష్ తన మరదలైన కావ్యకు తరచూ మెసెజ్ లు పెడుతున్నాడు. సురేష్ రెడ్డి అంటే ఇష్టం లేని కావ్య అతడి నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన సురేష్ తన తగ్గర ఉన్న తుపాకీతో యువతిని కాల్చి చంపేశాడు. దీంతో ఒక్కసారిగా తుపాకీ మోతలతో నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామం ఉలిక్కిపడింది.
ఇంటికి వెళ్లి కాల్చేశాడు..
ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. కోవిడ్ కారణంగా ఇద్దరూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కావ్య అంటే సురేష్ కు ముందు నుంచే ఎంతో ఇష్టం ఉండేది. దీంతో పలు మార్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి కావ్య అమ్మనాన్నతో మాట్లాడి.. ఆమెను పెళ్లికి ఒప్పించాలని కోరాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా కావ్య తల్లిదండ్రులతో మాట్లాడారు. అప్పుడు కావ్య ఈ పెళ్లికి నిరాకరించింది. అంతటితో సురేష్ రెడ్డి వదలకుండా మళ్లీ కావ్యకు మనం పెళ్లి చేసుకుందాం అంటూ మెసేజెస్ చేయడం ప్రారంభించారు. ఏడాది కాలంగా కావ్య ఒప్పుకుంటుందని వేచి చూశాడు. ఎంతకీ ఒప్పుకోకపోగా సురేష్ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూసిన సురేష్ రెడ్డి.. తన నంబరును బ్లాక్ చేయడంతో కోపంతో రగిలిపోయాడు. దీంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
సురేష్ రెడ్డి తన వద్ద ఉన్న తుపాకీ పట్టుకుని సోమవారం మధ్యాహ్నం సమయంలో కావ్య ఇంటికి వెళ్లాడు. కావ్య, తన సోదరి ఇద్దరూ కలిసి ల్యాప్ టాప్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో డోర్ ఓపెన్ చేసి కావ్యను తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే తన సోదరి అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమెను పక్కకు తోసేసి మళ్లీ దగ్గర నుంచి కాల్చి చంపేశాడు. పక్కనే ఉన్న సోదరి రక్తపు మరకలు చూసి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సురేష్ రెడ్డి అక్కడి నుంచి బయటకు వచ్చి నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లి తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సురేష్ రెడ్డికి తుపాకీ ఎవరిచ్చారు? ఎక్కడ నుంచి వచ్చింది? అనే దానిపై విచారణ చేపట్టారు. ఎప్పుడు కొనుగోలు చేశాడు? ఎన్ని రోజుల నుంచి తన వద్ద ఉంచుకున్నాడు? అనే దానిపై దృష్టి సారించారు. అంతేకాకుండా కావ్య, సురేష్ ల మధ్య జరిగిన ఫోన్ సంబాషణలు, చాటింగ్ లను పరిశీలించి.. తప్పెవరిది అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.
Next Story