Mon Dec 23 2024 05:12:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ బీజేపీ నేత
మియాపూర్ ఆల్విన్ కాలనీ లో జ్ఞానేంద్ర ప్రసాద్ నివాసం ఉంటూ ఉన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మియాపూర్ ఆల్విన్ కాలనీ లో జ్ఞానేంద్ర ప్రసాద్ నివాసం ఉంటూ ఉన్నారు. సోమవారం (ఆగస్టు 8) ఉదయం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించారు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రెండు నెలల క్రితం ఓ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
Next Story