Mon Dec 23 2024 02:17:47 GMT+0000 (Coordinated Universal Time)
డీజీపీని వదలని సైబర్ కేటుగాళ్లు
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ని కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టలేదు
Hyderabad : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ని కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టలేదు. మహేందర్ రెడ్డి డీపీ పెట్టి సామాన్యులకు మెసేజ్ లు పంపుతున్నారు. ప్రముఖులకు కూడా ఈ నెంబరుతో మెసేజ్ లు వస్తుండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. 9785743029 నుంచి ఈ మెసేజ్ లు వస్తున్నాయి.
వారి వలలో పడొద్దంటూ...
అయితే అది సైబర్ నేరగాళ్ల పని అని, ప్రజలు ఎవరూ వారి వలలో పడవద్దని పోలీసులు సూచించారు. ఈ మెసేజ్ లు పంపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. వారు ఎలాంటి మెసేజ్ లు పంపినా రియాక్ట్ కావద్దని సూచించారు.
Next Story