Mon Dec 23 2024 14:55:21 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన లక్ష్మీపతి అరెస్ట్
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా లక్ష్మీపతి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్నాప్‌చాట్
హైదరాబాద్ : అధిక మోతాదులో డ్రగ్స్ వాడటంతో ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో డ్రగ్స్ తయారీ, సరఫరా, కొనుగోళ్లు చేసిన పలువురు విద్యార్థులు, సూత్రధారులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కీలక నిందితుడైన లక్ష్మీపతిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారంరోజులుగా పరారీలో ఉన్న లక్ష్మిపతి మంగళవారం పోలీసులకు చిక్కాడు. నిందితుడు లక్ష్మీపతికి హైదరాబాద్ లో భారీ నెట్ వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా లక్ష్మీపతి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్నాప్‌చాట్, టెలిగ్రామ్, ఇన్‌స్టా వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వలవేసి, వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గోవా నుంచి హైదరాబాద్ కు లక్ష్మీపతి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. లీటర్ హాష్ ఆయిల్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ దందాలో లక్ష్మీపతికి 100 మందికిపైగా వినియోగదారులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Next Story