Mon Dec 23 2024 09:45:47 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై ఒక సెంట్రింగ్ కార్మికుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. 2018లో ఈ ఘటన జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన సెంట్రింగ్ కార్మికుడు దినేశ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
రంగారెడ్డి కోర్టు...
అప్పట్లో ఈ ఘటన సంచలనం కలిగించింది. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి న్యాయస్థానం 2021లో ఉరిశిక్ష విధించింది. రంగారెడ్డి న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దినేశ్ కుమార్ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని పేర్కొంది.
Next Story