Mon Dec 23 2024 13:43:35 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు : మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను డిసెంబర్ 16వ తేదీ, గురువారం ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను డిసెంబర్ 16వ తేదీ, గురువారం ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 49 శాతం ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 51 శాతం మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో చాలా మంది.. ఫెయిల్ అవ్వడాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. మంచి మార్కులతో పాస్ అవుతాం అని ఖచ్చితమైన హోప్ ఉన్న విద్యార్థులు తక్కువ మార్కులు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
ఆత్మహత్య....
అలా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లాలోని గాంధీనగర్ కాలనీకి చెందిన జాహ్నవి ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతోంది. గురువారం విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో జాహ్నవికి మార్కులు తక్కువ వచ్చాయి. దాంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. జాహ్నవి ఆత్మహత్యతో గాంధీనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story