Sat Nov 16 2024 18:30:52 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లాడిని పక్క వీధిలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్.. ఆ తర్వాత
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ తొమ్మిదేళ్ల బాలుడిని చంపేందుకు ఓ ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆటోతో వచ్చిన డ్రైవర్ కొద్దిసేపు మాట్లాడి.. ఆ బాలుడిని నమ్మించి పక్క వీధుల్లోకి తీసుకెళ్లాడు. అయితే అతడు ఉన్నట్లుండి బ్లేడుతో బాలుడి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు చూసి.. కేకలు వేయడంతో ఆ డ్రైవర్ పరారయ్యాడు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. అనంతరం బాలుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆ ఆటోడ్రైవర్.. ఆ పిల్లాడినే ఎందుకు చంపాలని ప్రయత్నించాడు అనే విషయమై కూడా ఆరాతీస్తున్నారు.
ఆ బాలుడికి ఏం జరుగుతుందో తెలుసుకొనే లోపే ఆటో డ్రైవర్ బాలుడి గొంతు కోసేశాడు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story