Sun Dec 22 2024 17:57:14 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తూ ఉండగా
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న
Road Accident:నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిని హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు.. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. తిరుపతి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య మృతి చెందారు. బాలకిరణ్ తల్లి దండ్రులు లక్ష్మీ, రవికుమార్, మరో బాలుడు మృతి చెందారు. ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ నెల 3న శామీర్ పేటలో రిసెప్షన్ అయింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story