Mon Dec 23 2024 04:57:37 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాలలో హై డ్రామా... టీడీపీ నేతను అరెస్ట్ చేసేందుకు వచ్చిన తెలంగాణ పోలీసులు
భూవివాదం కేసులో తెలంగాణ పోలీసులు టీడీపీ నేత శివానందరెడ్డి అరెస్ట్ చేసేందుకు నంద్యాలకు వచ్చారు
నంద్యాల జిల్లా అల్లూరులో హైడ్రామా సాగింది. భూవివాదం కేసులో తెలంగాణ పోలీసులు టీడీపీ నేత శివానందరెడ్డి అరెస్ట్ చేసేందుకు నంద్యాలకు వచ్చారు. అయితే ఆయన స్వగ్రామం అల్లూరుకు వచ్చి శివానందరెడ్డిని అరెస్ట్ చేయాలని చూశారు. అయితే ఇప్పుడే ఇంట్లోకి వెళ్లి వస్తానని చెప్పిన శివానందరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గతంలో హైదరాబాద్ లో...
శివానందరెడ్డి గతంలో హైదరాబాద్ లో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆయన అక్కడ పనిచేస్తున్న సమయంలో భూవివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై కేసు నమోదు కావడంతో తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. శివానందరెడ్డి తన ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకుని, తొలుత వైసీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు.
Next Story